నాలో నివసించే నా యేసయ్య Naalo Nivasinche Naa Yesayya Song Lyrics in telugu | Hosanna Ministries | telugu bible hub



నాలో నివసించే నా యేసయ్య Naalo Nivasinche Naa Yesayya Song Lyrics in telugu | Hosanna Ministries | telugu bible hub
నాలో నివసించే నా యేసయ్య Song Lyrics in telugu  Hosanna Ministries  telugu bible hub

Lyrics

నాలో నివసించే నా యేసయ్య

మనోహర సంపద నీవేనయ్యా (2)

మారని మమతల మహనీయుడ (2)

కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా -

మనసారా నిన్నే ప్రేమింతునయ్యా (2)

||నాలో నివసించే||



1. మధురమైనది నీ స్నేహబంధం -

మహిమగా నన్ను మార్చిన వైనం (2)

నీ చూపులే నన్ను కాచెను -

నీ బాహువే నన్ను మోసేను (2)

ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను (2)

||కీర్తించి||



2. వినయ భావము ఘనతకు మూలము -

నూతన జీవములో నడుపు మార్గం (2)

నా విన్నపం విన్నవులే -

అరుదేంచేనే నీ వరములే (2)

ఏమని వర్ణింతును నీ కృపలను (2)

||కీర్తించి||



3. మహిమ గలది నీ దివ్య రాజ్యం -

తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం (2)

సియోనులో చేరాలనే -

నా ఆశయం నెరవేర్చుము (2)

యేసయ్య నిన్ను చూచి హర్షింతును

భువినేలు రాజ నీకే నా వందనం -

దివినేలు రాజ వేలాది వందనం (2)

||నాలో నివసించే||


Credits by Hosanna Ministries