గమ్యం చేరాలని నీతో ఉండాలని Song Lyrics in telugu | Bro.John Wesley | telugu bible hub



గమ్యం చేరాలని నీతో ఉండాలని Song Lyrics in telugu  Bro.John Wesley  telugu bible hub
గమ్యం చేరాలని నీతో ఉండాలని Song Lyrics in telugu  Bro.John Wesley  telugu bible hub

Lyrics

గమ్యం చేరాలని నీతో ఉండాలని

పగలూ రేయి పరవశించాలని

ఈ నింగి నేలా కనుమరుగైనా

శాశ్వత జీవం పొందాలని

సాగిపోతున్నాను నిన్ను చూడాలని

నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2)       ||గమ్యం చేరాలని||



భువి అంతా తిరిగి జగమంతా నడచి

నీ జ్ఞానముకు స్పందించాలని

నాకున్నవన్ని సమస్తం వెచ్చించి

నీ ప్రేమ ఎంతో కొలవాలని

అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో

అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో         ||సాగిపోతున్నాను||



అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా

శిరమును వంచి సహించాలని

వేదన బాధలు గుండెను పిండినా

నీదు సిలువనే మోయాలని

నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి

నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని       ||సాగిపోతున్నాను|| 


Credits by Bro.John Wesley