త్రియేక దేవుడైన యెహోవాను Song Lyrics in telugu | Hosanna Ministries | telugu bible hub

త్రియేక దేవుడైన యెహోవాను Song Lyrics in telugu | Hosanna Ministries | telugu bible hub
త్రియేక దేవుడైన యెహోవాను Song Lyrics in telugu | Hosanna Ministries | telugu bible hub

Lyrics

త్రియేక దేవుడైన యెహోవాను

కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని

గాన ప్రతి గానములు చేయుచు ఉండును

నా శాపము బాపిన రక్షణతో

నా రోగాల పర్వము ముగిసేనే

వైద్య శాస్త్రములు గ్రహించలేని

ఆశ్చర్యములెన్నో చేసినావే|| త్రియేక ||

నా నిర్జీవ క్రియలను రూపు మాపిన

పరిశుద్ధాత్మలో ఫలించెదనే

మేఘ మధనములు చేయలేని

దీవెన వర్షము కురిపించినావే|| త్రియేక ||

నా స్థితిని మార్చిన స్తుతులతో

నా హృదయము పొంగిపొర్లేనే

జలాశయములు భరించలేని

జలప్రళయములను స్తుతి ఆపెనే|| త్రియేక ||

Credits by Hosanna Ministries