విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా Song Lyrics in telugu | Hosanna Ministries | telugu bible hub



విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా Song Lyrics in telugu  Hosanna Ministries  telugu bible hub
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా Song Lyrics in telugu  Hosanna Ministries  telugu bible hub

Lyrics

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా

కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)

నా యేసయ్యా నిను వేడుకొనగా

నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా||



అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2)



ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)

నిత్యానందము కలిగించె నీ

శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా||



ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2)

అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)

నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి

వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) ||విజయశీలుడా||



ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2)

అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2)

నిత్యము నీతో నేనుండుటకై

నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||


Credits by Hosanna Ministries